తాండూరు టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల విజయగాథను గుర్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5న పట్టణంలోని ఆదర్శ తులసీ నగర్, సాయిపూర్‌లలో హిందూ సమ్మేళన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు ముదెళ్లి అశోక్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. హిందూ సమాజం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం వంటివి వికసించేందుకు హిందూ బంధువులందరినీ సమ్మేళనం చేస్తున్న ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలిరావాలని కోరారు. 5వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి పాతకుంటలోని పెద్ద పార్కుల స్థలంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
సంక్షేమ ఫలాలే
పేదలకు బలం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలే పేదలకు బలమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చౌదర్‌పల్లిలో రూ.10 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు డావుల పద్మమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్‌రెడ్డి, పసుల వెంకటయ్య, వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కందుకూరు: 108 సంస్థ (జీవీకే ఈఎంఆర్‌ఐ) వికారాబాద్ జిల్లాలో పని చేయడానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రోగాం మేనేజర్ జాన్ సయ్యద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ)గా పని చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బీటెక్ మెకానికల్ ఉత్తీర్ణులై ఉండాలని, ఐదేళ్ల అనుభవం ఉండి, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర సమాచారం కోసం 79950 61581 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
బైక్‌పై వెంబడించి..
గోవులను కాపాడి
షాద్‌నగర్‌రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్‌పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు.


