ఓటర్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఓటర్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయండి

Feb 1 2026 10:43 AM | Updated on Feb 1 2026 10:43 AM

ఓటర్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయండి

ఓటర్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయండి

ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

అనంతగిరి: ఓటర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. శనివారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నిక అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక ఇంటెన్సివ్‌ పునఃపరిశీలన(ఎస్‌ఆర్‌ఐ)లో భాగంగా ఓటరు మ్యాపింగ్‌, లక్ష్యం పూర్తి చేయడంపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడారు. బూత్‌ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 61 శాతం ప్రక్రియ పూర్తయిందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నైమత్‌ అలీ, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరి, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement