గుడ్‌విల్ దందా!
వికారాబాద్: ఎకై ్సజ్ శాఖకు అధికారులు ‘గుడ్‌విల్’వేట మొదలెట్టారు. ఈ విషయం మద్యం వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది. మద్యం వ్యాపారులు దందా నడిపించేందుకు ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడం పరిపాటిగా మారింది. వీటితో పాటు ఇటీవల టెండర్లు దక్కించుకున్న వ్యాపారుల నుంచి గుడ్‌విల్ పేరిట వసూళ్లు చేస్తున్నారంటూ వైన్స్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
ఆది నుంచీ ఆరోపణలే..
కొత్త మద్యం దుకాణాలు కొలువుదీరి వారం గడుస్తున్న తరుణంలో టెండర్లు దక్కించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. టెండర్ల సమయంలో బడా మద్యం వ్యాపారులతో కుమ్మకై ్క సమాచారం లీక్ చేసి ప్రభుత్వాదానికి గండికొట్టారని.. అధికారులే సిండికేట్ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపనలు వెల్లువెత్తాయి. ఇవి మరువక ముందే గుడ్‌విల్ పేరుతో వసూళ్లుకు పాల్పడుతున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. తమకు వచ్చిన మద్యం దుకాణంలో ఆశించిన మేరకు అమ్మకాలు జరగడం లేదంటూ మొరపెట్టుకుంటున్నా గుడ్‌విల్ విషయంలో ఎకై ్సజ్ అధికారులు వెనక్కి తగ్గటంలేదని ఓ మద్యం దుకాణం యజమాని వాపోయాడు.
నిబంధనల అమలులో విఫలం
దుకాణాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం గతేడాది నుంచి ప్రత్యేక నిబంధనలు రూపొందించినప్పటికీ అవి ఎక్కడా అమలుకు నోచుకోవటంలేదు. దుకాణాల ఏర్పాటు సమయంలో దుకాణాదారులు పాటించాల్సిన నిబంధనలు ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో ఎకై ్సజ్ అధికారులు విఫలమవుతున్నారు. పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఎన్కేపల్లిగేట్‌లో ఆలయానికి 50 మీటర్ల దూరంలోనే వైన్స్ ఏర్పాటు చేశారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఎదుట బాలికల పాఠశాలకు పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు సమస్యను పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదు.
● వైన్స్ ఎదుట పార్కింగ్ స్థలాలు తప్పనిసరి.
● దుకాణం ముందు భాగంలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎకై ్సజ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేయాలి.
● వైన్స్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి.
రూ.అర కోటిలో అందరికీ వాటా
మద్యం దుకాణాల ఓనర్ల నుంచి ఎకై ్సజ్ అధికారులు గుడ్‌విల్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. తీసుకునే మొత్తంలో ఉన్నతస్థాయి అధికారుల సైతం ఇవ్వాల్సి ఉంటుందంటున్నారని వ్యాపారులు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 59 మద్యం దుకాణాలు ఉండగా ఒక్కో దుకాణం నుంచి రూ.60 వేల– రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదు చేస్తే భవిషత్‌లో ఇబ్బందులు సృష్టిస్తారనే ఆందోళనతో మద్యం వ్యాపారులు మిన్నంకుటన్నట్లు చెబుతున్నారు.
90 శాతం సిండికేట్
కొందరు వ్యాపారులు ముందుగానే సిండికేట్‌గా మారి దరఖాస్తులు సమర్పించగా.. మరికొందరు దరఖాస్తుల గడువు ముగిశాక సిండికేట్‌గా మారారు. డ్రాలో కలిసివస్తే వాటా ఇస్తాం.. మీకే వస్తే తమకు వాటా ఇవ్వాలని డీల్ మాట్లాడుకున్నారు. అయితే 90 శాతం దుకణాలు సిండికేట్లకే దక్కడం గమనార్హం. ఒక్కో సిండికేట్‌లో వంద మంది మొదలుకుని 300 మంది వరకు ఒకచోట చేరి దరఖాస్తులు వేశారు.. ప్రస్తుతం పలు చోట్లు ఆయా సిండికేట్లు ఏదయితే మద్యం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించుకుంటారో అవే విక్రయిస్తున్నారు. ఆఫర్లు, మార్జిన్ ఉండే బ్రాండ్లనే విక్రయిస్తున్నారు. ఇదంతా ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం మొత్తం అధికారుల అండదండలతో జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
గుడ్‌విల్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనడంలో నిజం లేదు. ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని దుకాణాల ఎదుట నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అన్నీ పాటించాల్సిందే. ఎవరికీ మినహాయింపు ఉండదు.
– విజయభాస్కర్‌గౌడ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, వికారాబాద్
కొత్త మద్యం దుకాణాల నుంచి రూ.60 వేల–రూ.లక్ష వరకు వసూలు
నెల వారీ ముడుపులు అదనం
ఇప్పటికే రూ.50 లక్షలు అందాయని గుసగుసలు
టెండర్ల ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎకై ్సజ్ శాఖ


