క్షతగాత్రులకు కొనసాగుతున్న వైద్య సేవలు
చేవెళ్ల: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో 13 మందికి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి సూపరిండెంటెండ్ రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం నలుగురు కె.అనుసూయ, జె.జగదీశ్, బి.శ్రీనివాస్, జి.దయాకర్‌లు డిశ్చార్జి అవుతున్నారని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ సర్జరీ చేశారు: క్షతగాత్రుడు రవి
ప్రమాదం తలుచుకుంటే భయమేస్తోంది. ఏం జరిగిందో తెలియలేదు. తేరుకునే సరికి ఆస్పత్రిలో ఉన్నానని నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన రవి తెలిపారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. వికారాబాద్‌లో ఉంటున్నాని, హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. తీవ్రగాయాలతో ఉన్న తనను.. తొలుత చేవెళ్ల ఆస్పత్రికి తరలించారని, అనంతరం కుటుంబీకులు నగరంలోని సిటిజన్‌కు మార్చారని పేర్కొన్నారు. ముఖానికి గాయం కావటంతో పాటు పక్కటెముకలకు తీవ్రగాయమై లంగ్స్ సమస్య ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈ రోజు(బుధవారం) డిశ్చార్జి చేస్తానని చెప్పారు. అనంతరం వారం తరువాత రావాలని వైద్యులు సూచించారు.
క్షతగాత్రులకు కొనసాగుతున్న వైద్య సేవలు


