‘ఆదర్శ’ంగా నిలిచిన విద్యార్థినులు
చేవెళ్ల: వ్యాసరచన పోటీల్లో ఆదర్శ కళాశాల విద్యార్థినులు ఉత్తమంగా రాణించారు. ప్రథమ, తృతీయ స్థానంలో వరుసగా.. శృతి, గాయత్రి నిలిచారు. విజేతలకు మంగళవారం నగరంలోని బీఆర్‌కె భవన్‌లో రాష్ట్ర మహిళా రక్షణ విభాగం సీఐడీ, సైబర్ సెక్యూరిటీ డీజీపీ శిఖా గోయల్ ప్రశంసా పత్రాలు అందజేశారని కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గత నెల 27 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పరిధి కళాశాలల విద్యార్థులకు గత నెల 29న శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో చేవెళ్ల తెలంగాణ మోడల్‌కళాశాల విద్యార్థుల్లో ఇంటర్ చదువుతున్నఈ.శృతి మొదటి, వి.గాయత్రి మూడో స్థానంలో నిలిచారని వివరించారు.
వ్యాస రచన పోటీల్లో
ప్రథమ, తృతీయ బహుమతులు కై వసం
‘ఆదర్శ’ంగా నిలిచిన విద్యార్థినులు


