సంఘాల్లో చోటు కల్పించండి
మోమిన్‌పేట: మహిళా సంఘాల్లో కొత్త వారికి చో టు కల్పించాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ ఆధ్వ ర్యంలో కొత్తగా సంఘాల్లో చేరిన మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలను సక్రమంగా వినియోగించడంపై అవగాహన కల్పించాలన్నారు. సంఘాల్లోని సభ్యులతో ప్రతి నెలా సమావేశమై పొదుపు చేసుకోవడం, రుణాల చెల్లింపుపై చర్చించాలని తెలిపారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆర్థిక లావావేవీలు తెలుసుకోవాలన్నారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండటంతో బ్యాంకర్లు ఒక్కో సంఘానికి రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం మధుకర్, సీఆర్‌పీలు పద్మ, రిజియా, సీసీలు పాల్గొన్నారు.


