యాదయ్య, అలి వేలు
కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి దురాగతం
గాయాలతో బయటపడ్డ పెద్ద కూతురు
వికారాబాద్ జిల్లాలో ఘటన
కుల్కచర్ల: కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్క చర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య (36)కు 15 ఏళ్ల క్రితం గండీడు మండలం పగిడ్యాలకు చెందిన సాయమ్మ, కృష్ణయ్య దంప తుల కుమార్తె అలి వేలుతో వివాహమైంది. వారికి అపర్ణ (13), శ్రావణి (10) కూతు ర్లు ఉన్నారు. అయితే దంప తులు నాలుగేళ్లుగా గొడవప డుతూ పెద్దల సూచనతో వైవాహిక బంధాన్ని కొనసా గిస్తున్నారు. శుక్రవారం మరో మారు గొడవపడ్డారు. ఈ క్రమంలో అలివేలు సోద రి వల్లభరావుపల్లికి చెందిన హన్మమ్మ శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్ట గా వారు రాజీ కుదిర్చారు.
నిద్రలో ఉండగా దాడి
ఇంటికి వచ్చిన యాదయ్య ముందస్తు ప్రణాళిక ప్రకారం భార్య, వదిన, పిల్లలు నిద్రించిన తర్వాత మొదట హన్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దానికి నిద్రలోంచి లేచిన భార్యపై.. తదనంతరం మేము లేకుంటే మిమ్ముల్మి ఎవరు సాకుతారంటూ పిల్లలపై దాడి చేశాడు. దీంతో శ్రావణి మృతిచెందగా మరో కుమార్తె అపర్ణ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పరారైంది. అనంతరం యాదయ్య సైతం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అపర్ణ స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్, కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అలివేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


