‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి

Oct 29 2025 9:39 AM | Updated on Oct 29 2025 9:39 AM

‘ఫీజు

‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి

బీసీ సంఘం జాతీయ

కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌

తాండూరు టౌన్‌: కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ఉన్నత విద్యా కళాశాలల బంద్‌కు వారి అసోసియేషన్‌ పిలుపునిచ్చిందన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కోట్‌పల్లి ఎంపీడీఓగా హేమంత్‌

బంట్వారం: గ్రూప్‌ –1 ఆఫీసర్‌గా ఎంపికై న సీహెచ్‌.హేమంత్‌ కోట్‌పల్లి ఎంపీడీఓగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపీఓ డానియల్‌ తాండూరుకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా హేమంత్‌ మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.

మున్సిపల్‌ అభివృద్ధికి

రూ.18.7 కోట్లు

కమిషనర్‌ యాదగిరి

తాండూరు టౌన్‌: ము న్సిపల్‌ పరిధిలో పలు అభివృద్ధి పనుల నిమి త్తం ప్రభుత్వం రూ. 18.7 కోట్లు మంజూరు చేసినట్లు కమిషనర్‌ యాదగిరి మంగళవారం తెలిపారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.70 కోట్లు కేటాయించిందన్నారు. ఇట్టి నిధులతో మున్సిపల్‌ పరిధిలో అత్యవసర పనుల కింద సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పను లకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వా నికి పంపినట్లు కమిషనర్‌ తెలిపారు.

మినీ ఫంక్షన్‌ హాల్‌ను

పూర్తి చేస్తాం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి

దుద్యాల్‌: మండలంలోని చిలుముల్‌ మైల్వార్‌ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మినీ ఫంక్షన్‌ హాల్‌ను సకాలంలో పూర్తయ్యేలా చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి అ న్నారు. ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి మంగళవా రం ప్రారంభించారు. కార్యక్రమంలో కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, జి ల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, గ్రామస్తు లు నర్సింలు గౌడ్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

సన్నరకం వడ్ల బకాయి బోనస్‌ చెల్లించండి

తాండూరు టౌన్‌: గత రబీ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన సన్నరకం వడ్లకు సంబంధించిన బకాయి బోనస్‌ను వెంటనే చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ మేరకు సబ్‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. క్వింటాలు సన్నవడ్లకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు చేసిన వెంటనే బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌ గౌడ్‌, పటేల్‌ సాయిరెడ్డి, జుంటుపల్లి వెంకట్‌, రమ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఫీజు’ బకాయిలు  విడుదల చేయాలి 
1
1/3

‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి

‘ఫీజు’ బకాయిలు  విడుదల చేయాలి 
2
2/3

‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి

‘ఫీజు’ బకాయిలు  విడుదల చేయాలి 
3
3/3

‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement