మత్స్యకారుల సంక్షేమానికే..
చేప పిల్లల పంపిణీ
తాండూరు రూరల్: మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో 1.29 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని అల్లాపూర్ ప్రాజెక్టులో స్థానిక మత్స్యకారులతో కలి సి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలో 778 చెరువులు, ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. 152 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 5,600 మంది సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చెరువు లు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదులుతోందని పేర్కొన్నారు. తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని అల్లాపూర్ ప్రాజెక్టు, యాలాల మండలంలోని జుంటుపల్లి ప్రాజెక్టు, ముద్దాయిపేట్ చెరువులో దాదాపు 4 లక్షల 45 వేల చేప పిల్లలను వదిలామన్నారు. ఆరు నెలల్లో ఒక్కో చేప కిలో బరువు వస్తుందన్నారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్, చెంగోల్ పంచాయతీ కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


