సర్దార్ జయంతిని విజయవంతం చేద్దాం
అనంతగిరి: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ 150వ జయంతిని విజయవంతంచేద్దా మని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటేల్ సైనిక చర్యలతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి వేడుకలు నంబర్ 25వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో వ్యాసరచన, లఘుచిత్ర, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మైభారత్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీయువకులు అర్హులన్నారు. నవంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. నవంబర్ 26న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారి పేర్లు ప్రకటిస్తారన్నారు. అనంతరం ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల క్రీడల అధికారులు ఐసయ్య, సత్తార్, డీఆర్‌ఓ మంగీలాల్, బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, సీనియర్ నాయకులు పెంటయ్య గుప్తా, శివరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


