పారదర్శకంగా పనిచేయండి
అనంతగిరి: ప్రతి ఉద్యోగీ నిజాయితీగా ఉండాలని, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతతో, అవినీతికి అస్కారం లేకుండా, పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించా రు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు వచ్చిందని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సుపరిపాలన అందించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో నిజాయితీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, విజిలెన్స్ అధికారులు రఘురామ్, శ్రీనివాస్‌రావు, వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ పర్హీనాబేగం, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


