నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
దోమ: నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన శాస్త్రవేత్త బి.వి. ప్రసా ద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఖమ్మం నాచారం గ్రామంలో నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల ఎంపికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతూ నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంట నుంచే విత్తన శుద్ధి చేసుకొని తిరిగి నాటేవారన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిసర్చ్ అసోసియేట్ సాయి కిరణ్, ఏఈఓ హరిక పాల్గొన్నారు.


