కుక్కల దాడిలో 55 గొర్రెల మృతి
● రూ.3 లక్షల నష్టం
● ఆదుకోవాలని బాధిత రైతు వినతి
తాండూరు రూరల్: కుక్కల దాడిలో 55 గొర్రెలు, మేకాలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు సతప్ప వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని షెడ్డులో జీవాలను ఉంచాడు. ఉదయం పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం షెడ్డు వద్దకు వచ్చాడు. అప్పటికే గొర్రెలు, మేకలు చనిపోయాయి. కుక్కలు దాడి చేయడంతోనే జీవాలు చనిపోయాయని తెలిపాడు. రూ.3 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు సతప్ప కోరారు.


