ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
అనంతగిరి: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇప్పటికే పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సోమవారం నగరం నుంచి ధాన్యం, పత్తి కొనుగోలుపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సేకరించే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్


