శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం
పరిగి: రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం తెలిపారు. సోమవారం మండలంలోరి సయ్యాద్‌పల్లిలో ఆహార భద్రత మిషన్ పథకం కింద ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం లుధియానా వారి సాంకేతిక సహకారంలో అభివృద్ధి చేసిన డీహెచ్‌ఎం 206 రకం మొక్క జొన్న విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు సాగు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. కొత్తం రకం విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుజాత, మల్లయ్య, శ్రావణి, రాజేశ్వర్, మధుశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఏ లక్ష్మీకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, ఏఓ రజిత, రైతులు పాల్గొన్నారు.
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్‌రావు
అనంతగిరి: పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్‌రావు హెచ్చరించారు. సోమవారం వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.8,300 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని తెలిపారు. సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు నరేష్, జాయింట్ సెక్రటరీ శివ, నాయకులు సాయి, శరత్, మంజునాథ్, నందు, జశ్వంత్, మనీష, లోకేష్, ఆదిత్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచరాదని సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 106 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్‌రూరల్: కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి


