నిబంధనలకు విరుద్ధంగా సమీక్ష
బొంరాస్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండల పరిధి బురాన్‌పూర్ గ్రామ ఐక్య పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(గ్రామ సంఘం–2) అధ్యక్షురాలు భాగ్యమ్మ ఆరోపించారు. గతంలో రూ.4.25 లక్షలు దుర్వినియోగం అయ్యాయని, అదే విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లిందని ఆమె తెలిపారు. అదీ రికవరీ కాకుండానే.. సమీక్ష నిర్వహించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదే విషయంలో గతంలో ఆరోపణలు ఎదుర్కొని తొలగించిన వారి స్థానంలో తమను నియమించారని, అలాంటిది తమను విస్మరించడం సరికాదని సీసీ సత్యయ్యను నిలదీశారు. సీసీ పాతవారితో కుమ్మకై ్క సమీక్ష నిర్వహించారని ఆరోపించారు. ఇది గ్రామసంఘం నియమావళికి విరుద్ధమన్నారు. సీసీలుగా ఉండి మహిళా సంఘాల నిబంధనలు తుంగలో తొక్కడమే కాకుండా, మహిళా సంఘాల్లో ఐక్యతకు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 సంఘంలో సగానికి పైగా కోరం లేకుండానే సమీక్ష ఎలా చేపడతారని ప్రశ్నించారు.
పనితీరును పునరుద్ధరించడానికి
గ్రామం సంఘం–2లో ఇదివరకు డబ్బులు దుర్వినియోగం కావడం, వాటిని రికవరీ చేయగా.. కొంతమంది మొండికేసిన విషయం వాస్తవమేనని ఐకేపీ ఏపీఎం బందెయ్య తెలిపారు. దీని వలన సంఘానికి నిధులు రావడం లేదని పేర్కొన్నారు. ఆ డబ్బులను వసూలు చేయడానికి ప్రయత్నిస్తుని చెప్పారు. పనితీరును సరిచేయించి, ప్రస్తుతం కొత్తగా రుణం తీసుకునే అవకాశముందని వెళ్లడించారు. వాటిని అందించే ప్రయత్నం చేస్తామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.
సీసీ పనితీరుపై సంఘం
అధ్యక్షురాలు ఆగ్రహం


