
పారదర్శకంగా డీసీసీల నియామకం
చల్లా వంశీచంద్‌రెడ్డి
ఆమనగల్లు: డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా చేపడుతున్నామని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసీసీ ఇన్‌చార్జి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. బుధవారం నగరంలో చల్లాను ఆమనగల్లు, కడ్తాల్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.