
పంచాయతీ కార్యదర్శిపై దాడి!
తాండూరు రూరల్: దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేమూల్ మండలం తట్టెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపాల్‌కు.. తొలుత స్థానికుడైన లాల్‌సింగ్, భవానినగర్‌లో బోరు మోటారు మరమ్మతుకు గురైందని తెలిపాడు. అనంతరం బాగు చేయిస్తానని చెప్పి సదరు వ్యక్తిని కార్యదర్శి పంపించాడు. ఇదే విషయమై మంగళవారం ఉదయం ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యదర్శిపై లాల్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారని, ఉద్యోగం ఎలా చెస్తావో చూస్తానని బెధిరించినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తిపై మండల పరిధి పలువురు కార్యదర్శులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వేణుకుమార్ తెలిపారు.