కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

Oct 23 2025 9:22 AM | Updated on Oct 23 2025 9:22 AM

కారు

కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

దౌల్తాబాద్‌: అధికవేగంతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోస్గి నుంచి దౌల్తాబాద్‌కు వస్తున్న కారు.. మరో కారుకు సైడ్‌ ఇస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌ శివకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కోస్గి ఆస్పత్రికి తరలించారు. కారును బయటకు తీశారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

యాలాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలం పరిధి కోకట్‌ కాగ్నా నది నుంచి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారతో బుధవారం తెల్లవారు జామున పోలీసులు తనిఖీ చేపట్టారు.ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. పీఎస్‌కుతరలించారు.

ఆస్తి తీసుకున్నాడు..

అన్నం పెట్టడం లేదు

ఆర్డీఓకు ఓ తల్లి ఫిర్యాదు

ధారూరు: ‘తన పేరిట ఉన్న భూమి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ అన్నం పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లగొట్టాడు’ అని ఓ తల్లి.. తనయుడిపై వికారాబాద్‌ ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన గౌసియా.. భర్త మృతితో కొడుకుల వద్దఉంటోంది. పెద్ద కుమారుడు మైమూద్‌మియా.. ఆమెకు మాయమాటలు చెప్పి, ఉన్న భూమిని పట్టా చేయించుకున్నాడు. చిన్న కొడుకుకు వాటా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇవ్వలేదు. ఇదే విషయమై ప్రశ్నించగా.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని వృద్ధురాలు వాపోయింది. కొంత భూమిని అమ్ముకున్నాడని, మిగిలిన మూడు ఎకరాల భూమితో పాటు.. తన వద్ద ఉన్న రూ.3 లక్షల నగదును ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. తన స్థితిని చూసి ఆర్డీఓ అన్నం పెట్టించాడని బాధితురాలు తెలిపింది.

యువకుడి ఆత్మహత్య

ఆమనగల్లు: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామానికి చెందిన వస్పుల మల్లేశ్‌(27) తుక్క్ఠుగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసేవాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. బాధితున్ని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని

వాహనం ఢీ, వ్యక్తి మృతి

కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్‌ క్రాస్‌రోడ్డుపై బుధవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌కు చెందిన మామిళ్ల పాండు(60), ఉదయం రోడ్డు దాటుతుండగా.. కొత్తూరు నుంచి నగరం వైపు వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

కారు బోల్తా..  డ్రైవర్‌కు గాయాలు 1
1/2

కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

కారు బోల్తా..  డ్రైవర్‌కు గాయాలు 2
2/2

కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement