రైతు నేస్తం సాగుకు ఉపయుక్తం
దౌల్తాబాద్: రైతునేస్తం కార్యక్రమం సాగుకు ఎంతో లాభమని మండల వ్యవసాయ అధికారి లావణ్య అన్నారు. మంగళవారం మండలంలోని బాలంపేట రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక వ్యవసాయంపై సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న
సెల్‌ఫోన్ అందజేత
దుద్యాల్: రెండు నెలల క్రితం పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి మంగళవారం బాధితుడికి అందజేశారు. మండల పరిధిలోని హకీంపేట్‌కు చెందిన దొరమోని మల్లేశ్ జూలైలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీఈఐఆర్ సాయంతో ఫోన్‌ను గుర్తించి పట్టుకుని బాధితుడికి అందజేశారు.
లైసెన్స్డ్ సర్వేయర్లకు సన్మానం
మోమిన్‌పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన కావలి నర్సింలు, బిల్లపాటి రామకృష్ణ లైసెన్స్డ్ సర్వేయర్‌లుగా ఎంపికయ్యారు. ఈ మేరకు గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు.
ఎంపీఓ యాదయ్య బదిలీ
యాలాల: మండల పంచాయతీ అధికారి గాలి యాదయ్య నాగర్‌కర్నూలుకు బదిలీ చేస్తూ మంగళవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముడేళ్లక్రితం ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన యాదయ్య, మండల ప్రజలకు, నాయకులకు, అధికారులతో మమేకమవడంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవచూపారు. ఈ మేరకు ఆయన్ను జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
ఎస్‌బీఐ రెండో బ్రాంచ్ ఏర్పాటు చేయాలి
దోమ: మండల పరిధిలోని మరో ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ రాజిరెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు రీజినల్ మేనేజర్ నితిన్ వచ్చారు. ఈ మేరకు రాజిరెడ్డి ఆయనకు స్థానిక సమస్యలను వివరించారు. వినియోగదారులు ఎక్కువగా ఉన్నారని.. ఒకే బ్రాంచ్ ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. రద్దీ కారణంగా ఖాతాదారులకు ఇతరులను ఆశ్రయించి మోసపోతున్నారని వివరించారు. ఇందుకు స్పందించిన ఆర్‌ఎం నితిన్ సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.
మొయినాబాద్ రూరల్: గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని కాంగ్రెస్ రైతు సంఘం మండల అధ్యక్షుడు బొక్క వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తోల్‌కట్ట గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం సొంత ఖర్చుతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై తోల్‌కట్ట చౌరస్తా వరకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ లైట్లను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలంను నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అఽధ్యక్షుడు బొక్క వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌ముదిరాజ్, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అప్సర్, అమిత్‌ఖాన్, భిక్షపతి, బిలాల్, సలీం పాల్గొన్నారు.
రైతు నేస్తం సాగుకు ఉపయుక్తం
రైతు నేస్తం సాగుకు ఉపయుక్తం
రైతు నేస్తం సాగుకు ఉపయుక్తం


