మఠం అభివృద్ధికి కృషి
కొడంగల్ రూరల్: పట్టణంలోని జగద్గురు నిరంజన మఠం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌కుమార్‌తో కలిసి బవేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిరంజన మఠం అభివృద్ధికి తీసుకోవాల్సి చర్యల గురించి మఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీవీ సంగప్ప, బాలప్రకాశ్, ఆలయ పూజారి మఠం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


