‘భవిత’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘భవిత’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Oct 22 2025 9:20 AM | Updated on Oct 22 2025 9:20 AM

‘భవిత’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

‘భవిత’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

మండల విద్యాధికారి గోపాల్‌

పరిగి: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు భవిత కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి గోపాల్‌ సూచించారు. మంగళవారం ఆయన పట్టణ కేంద్రంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ భవిత కేంద్రం ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల విద్యకు తొలిమెట్టు అని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ, ప్రత్యేక విద్యా బోధన, ప్రత్యేక క్రీడలు నిర్వహిస్తారన్నారు. ఎలాంటి లోపాలు, సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపటిస్ట్‌ శివప్రసాద్‌రెడ్డి, జ్యోతి తదితరుతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement