అమరుల త్యాగాలు మరువలేనివి
పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి
పరిగి: విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలు, వారి సేవలు మరవలేనివని పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సుల్తాన్‌పూర్‌లోని అమర జవాన్ విజయభాస్కర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజారక్షణకు ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మోహనకృష్ణ, ఏఎస్‌ఐ గోపాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


