
రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమం
● 18న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను
విజయవంతం చేద్దాం
● తాండూరులో అఖిలపక్ష
బీసీ నాయకుల భేటీ
తాండూరు: రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమిస్తామని నాయకుడు ఈడిగి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ కన్వెన్షన్‌లో బీసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, కులసంఘాలు, బీసీ మేధావుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించినా హైకోర్టు స్టే విధించడంతో అన్యాయం జరిగిందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ కులాలంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందకు పార్టీలు, కులాలకతీతంగా ఏకమై పోరాడేందుకు ముందుకు రావడ ఆనందంగా ఉందన్నారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో బీసీ జేఏసీ ఏర్పాటు చేసి కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, ప్రభాకర్‌గౌడ్, నాయకులు ఉత్తమ్‌చంద్, మల్కయ్య, శ్రీనివాస్, విజయ్‌కుమార్, సంతోశ్, కె.గోపాల్, రాజన్‌గౌడ్, రజినీకాంత్ తదితరులున్నారు.