
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ పరిఽధిలోని సమద్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 160 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదల సొంతింటి కల సాకారం చేశామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇంటిని నిర్మించి ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, మాజీ కౌన్సిలర్లు నర్సింహులు, ప్రభాకర్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.