
కలెక్టర్ ఆదేశాలతో కదలిన యంత్రాంగం
● చంద్రవంచ, చిట్టిఘనాపూర్ వాగులను పరిశీలించిన అధికారుల బృందం
● పూర్తి నివేదిక కలెక్టర్‌కు అందజేస్తాం: డీపీఓ జయసుధ
తాండూరు రూరల్: ఇసుక అక్రమ రవాణాపై అందిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డీపీఓ జయసుధను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మైన్స్ ఆర్‌ఐ నిర్మల, మైన్స్ జియాలజిస్ట్ రవికుమార్, ఇరిగేషన్ ఏఈ సాయిబన్నతో కలిసి మండల పరిధిలోని చంద్రవంచ, చిట్టిఘనాపూర్ గ్రామ శివారులోని వాగుల్లో ఇసుక రీచ్‌లను పరిశీలించారు. వాగు సమీపంలో ఉన్న రైతుల నుంచి ఇసుక అక్రమ రవాణాపై వివరాలు సేకరించారు. పూర్తి నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామని డీపీఓ జయసుధ అన్నారు. కాగా చంద్రవంచ వాగు నుంచి ఇసుక తరలించే వీలు లేదని.. చిట్టిఘనాపూర్ వాగు నుంచి తరలించే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం.