
ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలి
తుక్కుగూడ: ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలని తపాలా శాఖ ఏఎస్పీ జోయల్ అన్నారు. శుక్రవారం పుర పరిధి మంఖాల్ పోస్టాఫీస్‌ను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయం ద్వారా తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కలిపిస్తుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయా లని సిబ్బందికి సూచించారు. కార్యాలయానికి వచ్చే లేఖలు, వివిధ పత్రాలను సకాలంలో ప్రజలకు చేరవేయాలని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ తపాల దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాఖ ఎస్‌పీఎం నవీన్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.