
రాకపోకల పునరుద్ధరణ
ధారూరు: మండల పరిధిలోని రుద్రారం– నాగసమందర్ గ్రామాల మధ్య కోట్‌పల్లి అలుగు వద్ద రాకపోకలను పునరుద్ధరించారు. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నుంచి పారి అలుగు ఉధృతికి కల్వర్డు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రాతిగుండ్లు తేలి, పెద్దపెద్ద గుంతలు పడటంతో ఈ మార్గం మీదుగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డిప్యూటీ ఎగ్జిక్యుటీవ్ ఇంజనీర్ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో మట్టి నింపి తాత్కాలిక మరమ్మతులు చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు శుక్రవారం నుంచి రహదారిని అందుబాటులోకి తెచ్చారు. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ప్రవహించే రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లేందుకు అనువుగా మార్చారు. దీంతో ఈ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పాయి. దూరభారం కూడా తప్పిందని పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తంచేశారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కోట్‌పల్లి అలుగు రోడ్డుకుతాత్కాలిక మరమ్మతు పనులు పూర్తి