తాండూరు టౌన్: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా.. పలు మాంసం దుకాణాలు వెలిశాయి. వీటి వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ.. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్ యాదగిరికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు.. జేసీబీ సహాయంతో ఆ షాపులను నేలమట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కక్షపూరితంగానే దుకాణాల ఎదుట నిర్మించిన దిమ్మెలను కూల్చేశారని యజమానులు ఆరోపించారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు ఇబ్బందికరంగా ఉన్న ఎలాంటి నిర్మాణమైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టరాదని సూచించారు.
ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ అధికారులు