
బానిసలుగా ఉండాల్సిందేనా?
రిజర్వేషన్లు అడ్డుకోవడంలోఅగ్రవర్ణాల కుట్ర చోద్యం చూస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేయకుండాసీఎం అడ్డుకోవాల్సింది బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ తాండూరు పట్టణంలోఆందోళన
తాండూరు టౌన్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుస్టే విధించడంలో అగ్రవర్ణాల కుట్ర దాగి ఉందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాల చెప్పు చేతల్లో పనిచేస్తూ బహుజనులు బానిసలుగానే బతకాలా అని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగిలింది అగ్రవర్ణాల వారే అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చోద్యం చూస్తూ కూర్చున్నాయని, నిజంగా వారికి బీసీలపై ప్రేమ ఉంటే హైకోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదని దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పుకున్న సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయకుండా అడ్డుకోలేక పోవడం విడ్డూరమన్నారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిందన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ, బహుజనులకు అధికారం దక్కకుండా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు సయ్యద్ షుకూర్, వెంకటేష్, అనిత, మంజుల, విజయలక్ష్మి, జగదీశ్వరి, శివలీల, బస్వరాజ్, నరేందర్, కృష్ణ, పరమేష్, రాము, రమేష్, రాజు, బాబు, యాసర్, జావీద్, జుంటుపల్లి వెంకట్, శివ, అరుణ్‌రాజ్, సురేష్ అంజద్ తదితరులు పాల్గొన్నారు.