
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మర్పల్లి: ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు విశ్రమించేది లేదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మధుకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే.. ప్రజలు గోస పడతారని నాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అనుకున్నట్లుగా నేడు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పార్టీ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ మధుకర్, టౌన్ ప్రెసిడెంట్ గఫార్, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, నాయకులు రమేష్, శ్రీకాంత్, గౌస్ పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలనుఅవలంబిస్తున్న కాంగ్రెస్
యూరియా సమస్యను
పట్టించుకోని సీఎం
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్