
మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని మృతి
బషీరాబాద్‌కు నాలుగు సార్లు ఏకగ్రీవం
బషీరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, బషీరాబాద్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని(93) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. 1971–1989 బషీరాబాద్ సర్పంచ్‌గా నాలుగు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృస్టించారు. అనంతరం కుటుంబం తాండూరుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మంగళవారం తాండూరులో ఆయన అంత్యక్రియలు జరిపించారు. పర్తాని మృతిపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ బీషీరాబాద్ సీనియర్ నాయకులు వెంకటేశ్ మహరాజ్, అజయ్‌ప్రసాద్, మాణిక్‌రెడ్డి, పవన్‌ఠాకూర్, జగన్నాథ్, పలువురు వ్యాపారవేత్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కుల్కచర్ల: కుటుంబ ఉన్నతికి గృహ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బోయిన ప్రభాకర్(35) గృహనిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. ప్రభాకర్ మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా విద్యుత్‌వైర్లు తగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోష, కూతురు సహస్ర(7), కుమారుడు రిత్విక్(5) ఉన్నారు.
తప్పిపోయిన బాలుడు కుటుంబీకుల చెంతకు
పూడూరు: తప్పిపోయిన బాలుడిని చన్గోముల్ పోలీసులకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన బాలుడు ప్రవీణ్(7) మంగళవారం చేవెళ్ల బస్ స్టేషన్‌లో తాండూరు డిపో బస్సు ఎక్కాడు. కండక్టర్ టికెట్ అడగడంతో బాలుడు డబ్బు లేదని చెప్పాడు. తండ్రి పేరు అడగ్గా ఎల్లప్పగా చెప్పాడు. దీంతో కండక్టర్ చన్గోముల్ ఠాణాలో అప్పగించాడు. పోలీసులు విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో మెయినాబాద్‌కు చెందిన ఎల్లప్ప దంపతులు పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
మళ్లీ ట్రెక్ పార్కులోకే వచ్చిన చిరుత
మణికొండ: మంచిరేవుల ట్రెక్ పార్కు నుంచి రాందేవ్‌గూడ మిలిటరీ ప్రాంతంలోకి వెళ్లిన చిరుత పులి ఒక రోజులోనే తిరిగి ట్రెక్ పార్కుకే చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున రాందేవ్‌గూడలోని మిలిటరీ ప్రాంతంలో రహదారి దాటుతూ అక్కడి సీసీ కెమెరాలో కనిపించిన విషయం తెలిసిందే. అక్కడ దానికి అనువుగా ఉండకపోవటంతో అది తిరిగి సోమవారం అర్ధరాత్రి 12.25 గంటలకు ట్రెక్ పార్కుకు చేరుకుని ట్రాప్ కెమెరాలో చిక్కిందని అటవీ రేంజ్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ప్రశాంతమైన అటవీ ప్రాంతాన్నే చిరుత ఇష్టపడుతుందన్నారు. మిలిటరీ ప్రాంతంలో దానికి ఆహారం లభించకపోవటం, వాహనాల శబ్దా లు అధికంగా రావటంతోనే తిరిగి ట్రెక్ పార్కు కు వచ్చి ఉంటుందని చెప్పారు. ట్రెక్ పార్కులో దానికి ఇష్టమైన అడవిపందుల వంటి ఆహారం లభిస్తుండటం, ఎలాంటి అవాంతరాలు లేకపోవటంతో మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దానికి సరైన ఆహారం లభించనప్పుడే బోన్‌లో ఎరగా పెట్టిన మేకను తినేందుకు వచ్చి చిక్కే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు ట్రెక్ పార్కును మూసి ఉంచుతామని, ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీసు రోడ్డులో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని లక్ష్మణ్ సూచించారు.

మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని మృతి

మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పర్తాని మృతి