
వసతులు కల్పించండి
తాండూరు టౌన్: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం మెరుగైన వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బస్టాండ్‌లో తాగునీటి సదుపాయం లేకపోవడం, మూత్రశాలల నిర్వహణ సరి గా లేకపోవడం, రాత్రి వేళలో విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ఆటోలు, జీపుల నిలుపుదల కోసం బస్టాండ్ సమీపంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. రానున్న శ్రావణమాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతిపత్రంలో కోరామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, కార్యదర్శి భద్రేశ్వర్, పట్టణాధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు కృష్ణ, నాయకులు సంగమేశ్వర్, కిరణ్, రాజు, శ్రీకాంత్, బబ్లూ పాల్గొన్నారు.