
సామూహిక గీతా పారాయణం
అనంతగిరి: గీతావాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా వికారాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఆషాఢ మాస భగవద్గీత పారాయణం నిర్వహించారు. ముగింపు కార్యక్రమాన్ని మారుతీనగర్ కాలనీలోని వైభవలక్ష్మి దేవాలయంలో గురువారం చేశారు. ఈ సందర్భంగా గీతావాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు తొడిగళ శ్రీదేవి సదానందరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి భగవద్గీతను చేర్చాలనే దృఢ సంకల్పంతో సనాతన ధర్మ పరిరక్షణకై ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎనిమిదేళ్ల నుంచి వికారాబాద్ ప్రాంతంలోని పలు దేవాలయాలలో భగవద్గీత తరగతులను నిర్వహించి సుమారు వెయ్యి మంది మహిళలకు, 600 మంది విద్యార్థులకు భగవద్గీతను నేర్పించామని చెప్పారు. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేశ్‌కుమార్, మాజీ ఎంపీపీ చంద్రకళ, గీతావాహిని ఉపాధ్యక్షురాలు లావణ్య, ప్రధాన కార్యదర్శి జయశ్రీ, కోశాధికారి వరలక్ష్మి, సభ్యులు ఝాన్సీలక్ష్మి, విజయ, నీరజ, మాధురి, సునీత, వరలక్ష్మి, స్వాతి, జోత్స్న, సరళ, కరుణ, సుధా, నాగరాణి, సంజీవరాణి, ఆలయ నిర్వాహకులు స్వరూప రమేష్, అర్చకులు విక్రమ్ పాల్గొన్నారు.