
మాజీ సర్పంచ్‌పై చర్యలు తీసుకోండి
తాండూరు టౌన్: దళితులపై దౌర్జన్యం చేస్తున్న మాజీ సర్పంచ్ వెంకట్రామ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుంటుపల్లికి చెందిన దళితులు తాను చెప్పినట్లు నడుచుకోవడం లేదంటూ కక్షగట్టిన ఆయన అనుచరులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దళితులను కులం పేరుతో దూషిస్తూ, చంపుతానని భయపెడుతున్నాడని మండిపడ్డారు. వెంటనే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, నాయకులు నెత్తి పకీరప్ప, నర్సిములు, అంజిలప్ప, చిన్న హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట
ప్రజాసంఘాల ఆందోళన