పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం

Jul 19 2025 1:17 PM | Updated on Jul 19 2025 1:17 PM

పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం

పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం

● కాంగ్రెస్‌ వచ్చాక ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు ● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి/తాండూరు: పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మండలంలోని సయ్యాద్‌ మల్కాపూర్‌, రాఘవాపూర్‌, జాఫర్‌పల్లి, చిట్యాల, రాపోల్‌, సయ్యాద్‌పల్లి గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాము అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు చిన్న నర్సింహులు, ఆంజనేయులు, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రుణాల చెల్లింపులో ఆదర్శం

మండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి,

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

బ్యాంక్‌ లింకేజీ రుణాల చెల్లింపులో మహిళా సంఘాల సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను, ఫుడ్‌ మేళాను అధికారులతో కలిసి నేతలు పరిశీలించారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను చూసి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో మహిళా శక్తి ఎంతో కీలకమన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు, రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్నారు. గత ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని అన్నారు. అన్ని పథకాలను మహిళల పేరిటే ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అనంతరం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్‌, మాజీ ఎంపీపీ కరుణ అజయ్‌ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement