
జీఓ 317ను రద్దు చేయాలి
బషీరాబాద్: ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన 317 జీఓను వెంటనే రద్దు చేయాలని తపస్ రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీంకాంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు పాఠశాలలల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో నేటి సీఎం రేవంత్‌రెడ్డి 317 జీవోను తప్పుబట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపించాలన్నారు. అలాగే డీఏ బకాయిలను నెలనెలా చెల్లించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందిచడానికి పోరాడుతుందని, దీనికి ఉపాధ్యాయులు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాజుల వీరేశం, కవిత, కే శోభ, జిల్లా బాధ్యులు చంద్రశేఖర్ గౌడ్, పట్లోళ్ల అనిల్, రవి గౌడ్ దూస శ్రీనివాస్, అనిల్ కుమార్, కే శ్రీనివాస్, సునీత పాల్గొన్నారు.
తపస్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మీకాంతరావు