
‘సీజనల్’పై సమాయత్తం
ముందస్తు చర్యలతో వ్యాధుల కట్టడి ●
● జిల్లాలో పరిస్థితిపూర్తిగా అదుపులో ఉంది ● ఫీవర్ సర్వే చేయిస్తున్నాం ● ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక ఉండాల్సిందే ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి లలితాదేవి
వికారాబాద్: ‘ముందస్తు చర్యలే నివారణ మార్గం.. వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. లేకుంటే సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు సహకరిస్తే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం’ అని డీఎంహెచ్‌ఓ లలితాదేవి అన్నారు. సీజనల్ వ్యాధులు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ, సిజేరియన్ ఆపరేషన్ల నియంత్రణకు శాఖా పరంగా తీసుకుంటున్న చర్యలను ‘సాక్షి’కి వివరించారు. ఆమె మాటల్లోనే..
17 డెంగీ కేసులు నమోదు
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చేయిస్తున్నారం. అక్కడక్కడ జ్వరం కేసులు నమోదవుతున్నాయి. ఇవి కూడా సాధారణ జ్వరాలే. గతంతో పోలిస్తే విష, వైరల్ ఫీవర్ కేసులు చాలా తక్కువే. ప్రస్తుతం జిల్లాలో 17 డెంగీ కేసులు ఉన్నా నియంత్రణలోనే ఉన్నాయి.. అప్రమత్తంగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో, బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం
విస్త్తృతంగా అవగాహన కార్యక్రమాలు
సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వసతి గృహాల్లో విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నట్లు సమాచారం రావడంతో ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు విజిట్ చేయాలని ఆదేశించాం. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించాం. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ప్రజలను కోరాం. వీటితో పాటు రోజువారి కార్యక్రమాలు వ్యాధి నిరోధక టీకాలు, ప్రసవాలు, రక్త పరీక్షల నిర్వహణ తదితర సేవలు యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు పరిశుభ్రతను పాటిస్తే సీజనల్ సమస్యలను అధిగమించగలమని భావిస్తున్నాం.
రాష్ట్రంలో మూడో స్థానంలో..
జిల్లాలో 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 134 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఏడు 24 గంటల పీహెచ్‌సీలు ఉన్నాయి. అన్ని ఏరియా, జిల్లా ఆస్పత్రులతో పాటు కొన్ని పీహెచ్‌సీలలో కాన్పులు చేస్తున్నాం. డెలివరీల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. హైరిస్క్ కేసులను జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నాం. ప్రైవేటు హాస్పిటల్స్‌లో 60 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45 శాతం అవుతున్నాయి. వీటి సంఖ్య మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వారి పరిధి దాటి వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. వైద్యడి సూచనలు లేకుండా మందులువిక్రయించరాదు.
అబార్షన్లు చేస్తే చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తే ఉపేక్షించం. ఒకవేళ అబార్షన్ చేయాల్సి వస్తే గర్భం దాల్చి న 24 వారాల లోపు డీఎంహెచ్‌ఓ అనుమతి తీసుకోవా లి.ఆ తర్వాత చేయాల్సి వస్తే మెడికల్ బోర్డు అ నుమతి తప్పని సరి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలకు సంబంధించి ధరల పట్టిక కచ్చితంగా ఉండాలి. ప్రైవేట్ ల్యాబుల్లో అధిక ధరలు వసూలు చేస్తే చర్య లు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇక్కడ 150 రకాల టెస్టులు చేస్తారు.ఇవన్నీ ఉచితంగానే. ప్రజలు టెస్టుల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన పనిలేదు. వారికి అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో రక్త న మూనాలు ఇస్తే ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.