
మహిళా సాధికారతే లక్ష్యం
కొడంగల్: నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.8 కోట్లా 58 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసినట్లు కడా ప్రత్యేకాఽధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేష్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం కడా కార్యాలయంలో సంఘం సభ్యులకు చెక్కులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తోందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఉచిత కరెంటు, రూ.500లకు గ్యాస్ సిలిండర్ తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి మహిళలను అన్ని రంగాల్లోనూ ఆసరాగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మహిళా సంఘాల ఇన్‌చార్జ్ నరసింహ్మ, ఏపీఓ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణంరాజు, నయీమ్, ఓం ప్రకాశ్, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు రేషన్ కార్డులు
నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు 2,579 కొత్త రేషన్‌కార్డులు మంజూరైనట్లు చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు
కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి