
ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరు
పరిగి: విద్యా, ఉపాధ్యాయ సమస్యలపై పీఆర్‌టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోస్టింగ్‌లో సర్దుబాటు, పెండింగ్ బిల్లులు, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర, జిల్లా శాఖకు తెలిపామన్నారు. పీఆర్‌టీయూ 52 ఏళ్లుగా అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సమస్యలను పరిష్కరించుకుందన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్న సంఘం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు బుగ్గయ్య, గౌరవ అధ్యక్షుడు ఉస్మాన్‌అలీ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, గోపాల్, శంకర్, సుభాష్, నాయకులు రామాంజనేయులు, వవెంకటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా
ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్