
గ్రామీణ రోడ్లకు మహర్దశ
పరిగి: మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ కింద ప్రభుత్వం రూ.1.19 లక్షలు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించి వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలు
పూడూరు: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి చెప్పారు. బుధవారం మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లి–లాల్‌పహాడ్ వరకు రూ.20 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు ప్రతి పల్లెకు బీటీ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు నిర్మాణంతో పాటు పరిగి–షాద్‌నగర్ వరకు, పరిగి నుంచి వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. మన్నెగూడ నుంచి నాగర్‌గూడ వరకు డబుల్ రోడ్డు మంజూరయిందని తెలిపారు. పూడూరు గేటు నుంచి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు పనులను త్వరలో పూర్తి చేసేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు, రేషన్‌కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు రఘురాథ్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, పెంటయ్య, శ్రీనివాస్, అజీంపటేల్, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, నాయకులు లాల్‌కృష్ణ, వీరేష్, సురేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
రూ.20 కోట్లతో లాల్‌పహాడ్ – అంగడిచిట్టంపల్లి రహదారి పనులు ప్రారంభం