
లంచం అడిగితే పట్టివ్వండి
బషీరాబాద్: ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని ఎక్మాయి గ్రామంలో మొక్కలు నాటి, రూ.10 లక్షల ఫార్మేషన్ రోడ్డు పనులు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల మంజూరుకు అధికారులు కానీ, నాయకులు కానీ లంచాలు అడిగితే వాళ్లను తనకు పట్టివ్వాలని సూచించారు. ఎక్మాయిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు స్థానిక నేతలు డబ్బులు వసూలు చేశారని పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ వాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి నాయకులు కాగితాలపై జీవోలు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడితే, తాను 18 నెలల కాలంలో తీసుకొచ్చిన జీఓలన్నీ అమలు చేశానన్నారు. నాయకులు పంథాలు వీడి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం గ్రామస్తుల నుంచి అర్జీలు తీసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, ఏఎంసీ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, తహసీల్దార్ షాహేదాబేగం, ఎంపీడీఓ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈత వనాలతో ఆర్థికాభివృద్ధి
వనమహోత్సవంలో భాగంగా మల్కన్‌గిరి గ్రామ పరిధిలో మధుసూధన్‌గౌడ్‌కు రైతు పొలంలో ఈత చెట్లను ఎకై ్సజ్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈతవనాలు పెంచడంతో గీత కార్మికులు ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈత వనాలు పెంచడంతో కల్తీ కల్లు పూర్తిగా నిరోధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సహాయ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు రవీందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, పీసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ సరస్వతి శ్రీదేవి, సెక్షన్ అధికారి స్నేహశ్రీ, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి