
యాగాలకు తరలిన అర్చకులు
కొడంగల్ రూరల్: ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీచండీ, కుభేర, పాశుప త యాగాలకు బుధవారం అర్చక బృందం సభ్యు లు కొడంగల్ నుంచి హైదరాబాద్ తరలివెళ్లారు. దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు సాఽ దించాలనే సంకల్పంతో హైదరాబాద్‌లోని తుల్జాభవన్ ధర్మశాలలో డీడీఎన్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం సభ్యులు మూడు రోజులపాటు యాగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదమంత్రోచ్ఛారణ, జపములతో అర్చకులు యాగం చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో విరాజిల్లుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈక్రతువు చేపట్టినట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి బుధవారం యాగశాలను దర్శించారని డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో నట రాజ్‌స్వామి, అఖిలేష్‌స్వామి. జగదీష్, సంతోష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.