
బోనం.. అమ్మకు ఘనం
బొంరాస్‌పేట: మండల పరిధిలోని రేగడిమైలారంలో ఆషాఢమాసం సందర్భంగా బుధవారం సామూహికంగా లక్ష్మమ్మ బోనాల పండుగ నిర్వహించారు. ఉదయం ఊరేగింపుగా జల్ది కార్యక్రమం చేశారు. సాయంత్రం బోనాలెత్తిన మహిళల ఊరేగింపు పోతురాజులతో బ్యాండు మేళాల నడుమ కన్నుల పండువగా సాగింది. కార్యక్రమంలో కురువ సంఘం అధ్యక్షుడు లింగప్ప, గ్రామస్తులు, తదితరులున్నారు.
దోమ : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గ్రామ దేవత పోచమ్మకు బోనాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం బొంపల్లి గ్రామంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి బోనాన్ని అందంగా అలంకరిచి మహిళలు ఆలయానికి బయల్దేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింత మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపును ప్రజలు వైభవోపేతంగా నిర్వహించారు.

బోనం.. అమ్మకు ఘనం