
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
మర్పల్లి: కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. మండలంలోని సిరిపురం కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్న విషయం తెలుసుకున్న ఆయన బుధవారం విద్యాలయానికి వచ్చారు. అప్పటికే డీఈఓ రేణుకాదేవి పాఠశాలలో ఉంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు తాను వచ్చానని గేటు తీయాలని ఆనంద్ డీఈఓను కోరారు. మీరు పాఠశాలలోకి రావొద్దని ఎస్‌ఓను గేటు వద్దకు పంపుతానని డీఈఓ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తే స్కూల్‌లోకి పంపుతారు తమనెందుకు పంపరని ఆనంద్ నిలదీశారు. దీంతో గేటు తీసి పాఠశాలలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మధుకర్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పార్టీ శ్రేణులు గఫార్, శ్రీకాంత్, గౌస్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్