
కళాశాలల్లో అడ్మిషన్లు పెంచండి
ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ జ్యోత్స్నారాణి
అనంతగిరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డా. జ్యోత్స్నా రాణి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రతి కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ద్వారా విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షల కోసం ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కళాశాలల్లో వివిధ మరమ్మతు పనుల కోసం నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. జిల్లాకు కొత్త వచ్చిన ప్రిన్సిపాళ్లు రోజారాణి, వసంత, రమణ కుమారిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు రూపాలక్ష్మి, నర్సింహారెడ్డి, కుమారస్వామి, బుచ్చిరెడ్డి, సురేశ్వరస్వామి, వెంకటేశ్వర్‌రావు, మల్లినాధప్ప, పండరి, మక్బుల్, ఆఫీస్ సిబ్బంది వినోద్, సలీమా బేగం, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.