
చికిత్స పొందుతూ యువకుడి మృతి
దోమ: సాగులో వాడే క్రిమి సంహారక మందు తాగి ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బాలమణి దంపతులకు శ్రీకాంత్(27) ఏకై క కుమారుడు. అతను కొంత కాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఇబ్బందులకు గురవుతుండేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 12వ తేదీ రాత్రి ఊటుపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు డీగ్రి వరకు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు చేదొడు వాదొడుగా ఉండేవాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.