
ఉత్తమ సేవలకు అవార్డులు
అనంతగిరి: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి నగరంలోని గాంధీ భవన్ ప్రకాశం హాల్‌లో ఆదివారం అవార్డులు అందజేశారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వికారాబాద్‌కు చెందిన శ్రీ వివేక వాణి విద్యాలయం కరస్పాండెంట్ ఎం.నాగయ్య స్వరూప దంపతులతో పాటు గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ చేవెళ్ల చంద్రశేఖర్ ఉష దంపతులకు అవార్డులు అందజేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి రంగాల్లో సేవ చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, సామాజిక వేత్త, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.