
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలి
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన
దోర్నాల్ గ్రామస్తులు
ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్ పంచాయతీ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. గ్రామానికి చెందిన కమ్మరి మోహన్ అక్రమంగా ఇటి నిర్మాణం చేపట్టాడని గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన రాజకీయ ఒత్తిడితో ఏం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చొరవ తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
నేడు సింహ గర్జన సన్నాహక సమావేశం
కుల్కచర్ల: ఆసరా, దివ్యాంగుల పెన్షన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 13న నగరంలో దివ్యాంగుల సింహ గర్జనను విజ యవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నా యకుడు వెంకట్రాములు అన్నారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
తీన్మార్ మల్లన్నపై దాడి అప్రజాస్వామికం
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్
తాండూరు టౌన్: క్యూన్యూస్ కార్యాలయం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి అప్రజాస్వామికమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలపడం లేదా చట్టపరంగా ఆయన్ను ఎదుర్కోవాలన్నా రు. మీడియాపై, జర్నలిస్టు మల్లన్నపై దాడి సబబు కాదన్నారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా మల్లన్న తన క్యూన్యూస్ ద్వారా అక్రమాలను ప్రశ్నిస్తున్నారన్నారు. పజాస్వా మ్య దేశంలో దాడులు సమంజసం కాదని, వెంటనే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
‘ప్రజావాణి’ని
వినియోగించుకోవాలి
కోట్‌పల్లి ఎంపీడీఓ డానియల్
బంట్వారం: మండల పరిషత్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోట్‌పల్లి ఎంపీడీఓ డానియల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఒక్క ధరఖాస్తు కూడా రాలేదు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప, ఆర్‌ఐ భాగ్యలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ ఎలీషా, వెటర్నరీ అధికారి జగన్ తదితరులు పాల్గొన్నారు.