
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరెడ్డిపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ రాములుపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదర్శ జంటకు ప్రభుత్వం ఆర్థికసాయం
నవాబుపేట: కులాంతర వివాహం చేసుకున్న ఆదర్శ జంటకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థికసాయాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య అందజేశారు. మండల పరిధిలోని ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయిహర్షితను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.2.50 లక్షలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే యాదయ్య శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో నవాబుపేట ఎస్సీ హాస్టల్ వార్డెన్ శుక్లవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
పూడూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో మంజూరైన ఇళ్లు ఏ దశలో ఉన్నాయని, కొలతల ప్రకారం మార్కింగ్ ఇస్తున్నారని హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ క్రిష్ణయ్య, డీఈఈ ముక్రం, ఎంపీడీఓ పాండు పాల్గొన్నారు.
నిర్మాణ దారుడిపై కేసునమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: బాలికతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్‌గూడ సమీపంలో అనిల్ కన్‌స్ట్రక్షన్ యజమాని, భవన నిర్మాణ రంగంలో జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికతో పనిచేయిస్తుండగా.. బాలికకు విముక్తి కల్పించారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు.
యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బాబానగర్‌కు చెందిన అజీజ్ అక్తర్(26) ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. అతనిపై పలు దొంగతనం కేసులు ఉండడంతో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్‌ను గతంలో ఓపెన్ చేశారు. ఉదయం బాలాపూర్ రోడ్డులోని నా లా పక్కన అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, సీఐ గోపీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని మెడ, కడుపు, వీపుపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత